Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Nas — Ayah 6

114:6
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ ٦
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు![1]1
Footnotes
  • [1]

    ఈ వస్ వస - చేసేవారు రెండు రకాల వారు. ఒకరు జిన్నాతులలోని షై'తానులు. అల్లాహ్ (సు.తా.) వాటికి మానవులను, మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షించే యుక్తిని ఇచ్చాడు. ప్రతి మానవుని వెంట ఒక షై'తాను ఉంటాడు. వాడు అతన్ని మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ మాట విని ఒక 'స'హాబీ (ర'ది.'అ.) ఇలా అడిగారు: "ఓ ప్రవకా ('స'అస) ఏమీ? మీతో పాటు కూడా షై'తాన్ ఉన్నాడా?" అతను జవాబిచ్చారు: "అవును! ఉన్నాడు, కాని అల్లాహ్ (సు.తా.) నాకు వాడిపై ఆధిక్యతనిచ్చాడు అందుకని వాటు నాకు విధేయుడిగా ఉంటాడు. వాడు, నాక మేలు తప్ప మరొక విషయాన్ని ప్రోత్సహించడు." ('స'హీ'హ్ ముస్లిం)

    రెండవ రకమైన షై'తాన్ లు మానవులలో ఉన్నారు. వారు, తాము మంచి ఉపదేశం ఇస్తున్నామని చెబుతూ మానవులను మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటారు.

    షైతాన్ మానవులనే కాక జిన్నాతులను కూడా మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడని మరి కొందరి అభిప్రాయం.