(యూసుఫ్) అన్నాడు: "ఈరోజు మీపై ఎలాంటి నిందలేదు.[1] అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించే వారిలో అందరి కంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి!1
Footnotes
[1]
ఏ విధంగానైతే యూసుఫ్ ('అ.స.) తనను చంపగోరి బావిలో పడవేసిన తన సోదరులను క్షమించారో! అదే విధంగా మక్కా విజయం రోజు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తతను చంపగోరిన, తన తెగవారైన, మక్కా ఖురైషులను క్షమించారు.