Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ar-Ra'd — Ayah 13

13:13
وَيُسَبِّحُ ٱلرَّعۡدُ بِحَمۡدِهِۦ وَٱلۡمَلَٰٓئِكَةُ مِنۡ خِيفَتِهِۦ وَيُرۡسِلُ ٱلصَّوَٰعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَآءُ وَهُمۡ يُجَٰدِلُونَ فِي ٱللَّهِ وَهُوَ شَدِيدُ ٱلۡمِحَالِ ١٣
మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)![1] మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్యతిరస్కారులు) అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు.[2]1
Footnotes
  • [1] చూడండి, 17:44. [2] షదీదుల్ మి'హాల్: ఖుర్ఆన్ లో ఈ వాక్యం కేవలం ఇక్కడే ఒకేసారి వచ్చింది. మి'హాల్: Contrivance, అంటే యుక్తి, కల్పన, తంత్రం, పన్నుగడ, కుట్ర, ఉపాయం, మొదలైనవి. షదీద్: Severe, Strong, కఠిన, తీవ్ర, దృఢ, బల, అద్భుత, ఘనమైనది.