మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు.[1]1
Footnotes
[1]
యూదులకు విధించిన ఆహార పదార్థాల నిషేధాలు వారి అన్యాయ ప్రవర్తన కారణంగా ఉండెను. చూడండి, 3:93, 6:146, 4:160.