Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Isra — Ayah 64

17:64
وَٱسۡتَفۡزِزۡ مَنِ ٱسۡتَطَعۡتَ مِنۡهُم بِصَوۡتِكَ وَأَجۡلِبۡ عَلَيۡهِم بِخَيۡلِكَ وَرَجِلِكَ وَشَارِكۡهُمۡ فِي ٱلۡأَمۡوَٰلِ وَٱلۡأَوۡلَٰدِ وَعِدۡهُمۡۚ وَمَا يَعِدُهُمُ ٱلشَّيۡطَٰنُ إِلَّا غُرُورًا ٦٤
మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు.[1] మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు.[2] మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా[3] మరియు వారితో వాగ్దానాలు చెయ్యి.[4] మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి.[5]1
Footnotes
  • [1] 'సౌతిక: నీ ధ్వని అంటే పాటలు, వాద్యాలు మరియు ఇతర మోసపుచ్చే మాటలు, అని అర్థం. వీటితో ష'తాన్ మానవులను మోసపుచ్చుతాడు. [2] దళాలు అంటే - షైతాను అడుగు జాడలను అనుసరించే మానవులు, జిన్నాతులు. [3] అమ్వాల్ వ అవ్ లాద్: అంటే సంపదలు మరియు సంతానం. అంటే నిషిద్ధ ( 'హరామ్) మార్గాలతో సంపాదించి, 'హరామ్ చేష్టలలో ఖర్చు చేసే ధనసంపత్తులు మరియు వ్యభారం వల్ల వచ్చే సంతానం. [4] 'షైతాన్ వాగ్దానాలు అంటే స్వర్గనరకాలు అనేవి ఏమీ లేవు, మరణించిన తరువాత పునరుత్థానం అనేది లేదు. మన జీవితం ఈ భూలోక జీవితం మాత్రమే. కావున వీలైనంత వరకు దీని సుఖసంతోషాలను మీకు తోచినట్లు అనుభవించండి, అని ప్రజలను మోసపుచ్చటం. [5] చూడండి, 4:120