ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం![1] మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).1
Footnotes
[1]
ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) ధర్మమే సత్యధర్మం, ఆయన ఆరాధనయే సత్య ఆరాధన, ఆయన వాగ్దనమే సత్యవాగ్దానం. ఆయన, తన స్నేహితులకు వారి శత్రువులకు విరుద్ధంగా సహాయపడటం కూడా సత్యమే! అల్లాహ్ (సు.తా.) తన ఉనికిలో తన కార్యసాధనలో, తన యోగ్యతలో సత్యవంతుడు.