(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు.[1] వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్ని శిక్షను రుచి చూపుతాము.1
Footnotes
[1]
ఇక్కడ ఆ వ్యక్తిని గురించి చెప్పబడింది. ఎవనికైతే అల్లాహ్ (సు.తా.)ను గురించి ఎలాంటి జ్ఞానం లేదో! ఈ విధమైన వివరాలకు చూడండి, 31:7, 63:5 మరియు 17:83.