ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చ వచ్చు. దప్పిక గొన్నవాడు - దానిని నీరుగా భావించి దాని వద్దకు చేరి, చివరికి ఏమీ పొందలేక - అక్కడ అల్లాహ్ ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు[1].1
Footnotes
[1]
అంటే సత్యతిరస్కారుడు ఎన్ని మంచిపనులు, సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎట్టి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంతో చేరిపోతాడు.