A translation of every ayah of the Quran in Telugu.
ఎవరా అల్లాహ్ (సు.తా.) కోరినవారు? ఇమామ్ షౌకాని ప్రకారం: వారు దైవదూతలు, దైవప్రవక్తలు, అమరవీరులు (షుహదా') మరియు విశ్వాసులందరూ!
[2] 'సూర్: బాకా, కొమ్ము, దానిని ఇస్రాఫీల్ ('అ.స.) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో ఊదుతారు. ఇది రెండుసార్లు లేక అంతకంటే ఎక్కువ సారర్లు ఊదబడుతుంది. మొదట ఊదబడినప్పుడు సమస్త (జీవరాసులు) భయంతో స్పృహ కోల్పోతారు. రెండవసారి ఊదబడినప్పుడు అందరూ చనిపోతారు. మూడవసారి ఊదబడినప్పుడు అందరూ తమ గోరీల నుండి లేచి వస్తారు. మరికొందరి ప్రకారం నాలుగవసారి బాకా ఊదబడినప్పుడు అందరూ మైదానంలో సమీకరించబడతారు.
Loading…
Loading…