ఇక మూసా అన్నాడు: "నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకు బాగా తెలుసు.[1] నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు."1
Footnotes
[1]
పరలోక సాఫల్యమే నిజమైన సాఫల్యం. సత్యతిరస్కారులు ఇహలోకంలో సాఫల్యం పొంద వచ్చు. భూలోకంలో దొరికే సుఖసంతోషాలు తాత్కాలికమైనవే! వాస్తవానికి పరలోక సుఖ సంతోషాలే చిరకాలముండేవి.