కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు.[1] అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.1
Footnotes
[1]
దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రతి వ్యక్తి పుట్టుకతో స్వాభావికంగా అల్లాహ్ (సు.తా.) కు విధేయుడు (ముస్లిం) అయి ఉంటాడు. కానీ ముస్లిమేతరులైన అతని తల్లిదండ్రులు అతనిని యూదుడు, క్రైస్తవుడు, మజూసీ (లేక ఇతర మతస్తుడి) గా చేస్తారు.' ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స'హీ'హ్ ముస్లిం)