అపుడు వారిలోని ఒక పక్షం వారు: "ఓ యస్ రిబ్[1] (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!" అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: "మా ఇండ్లు భద్రంగా లేవు."[2] కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు.1
Footnotes
[1]
ఆ కాలంలో ఆ ప్రాంతమంతా యస్'రిబ్ అనే పేరుతో పిలువబడేది. ఆ ప్రాంతంలోనే మదీనా మునవ్వరా ఉంది.
[2] అంటే ఒడంబడిక త్రెంపిన బనూఖురైజా తెగవారు దక్షిణ దిక్కునుండి దాడి చేస్తారేమోననే భయం.