Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Ahzab — Ayah 57

33:57
إِنَّ ٱلَّذِينَ يُؤۡذُونَ ٱللَّهَ وَرَسُولَهُۥ لَعَنَهُمُ ٱللَّهُ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَأَعَدَّ لَهُمۡ عَذَابٗا مُّهِينٗا ٥٧
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.[1]1
Footnotes
  • [1] అల్లాహ్ (సు.తా.) ను ఎవ్వరూ బాధించలేరు. ఇక్కడ దీని అర్థం అల్లాహ్ (సు.తా.) కు ఇష్టం లేని పని చేయడం. ఉదా: అల్లాహ్ (సు.తా.)కు సంతానం అంటగట్టడం. అల్లాహ్ (సు.తా.) యొక్క సందేశహరునికి బాధ కలిగించడం అంటే, అతని ('స'అస) పై అసత్యవాదుడు, కవి, మాంత్రికుడు అని అపనిందలు మోపడం. ల'అనతున్: అంటే అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాల నుండి బహిష్కరించ, శపించ, నిషేధించ, త్రోసివేయ, దూషించ బడటం అనే అర్థాలున్నాయి. చూడండి, 2:88.