Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ya-Sin — Ayah 69

36:69
وَمَا عَلَّمۡنَٰهُ ٱلشِّعۡرَ وَمَا يَنۢبَغِي لَهُۥٓۚ إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ وَقُرۡءَانٞ مُّبِينٞ ٦٩
మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు.[1] మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే. [2]1
Footnotes
  • [1]

    మక్కా ముష్రికులు దైవప్రవక్త ('స'అస) ను వివిధ ఆరోపణలతో పీడించేవారు. వాటిలో ఒకటి ఇతను ('స'అస) కవిత్వం చెబుతున్నాడని. దానికి అల్లాహ్ (సు.తా.) ఇక్కడ జవాబిస్తున్నాడు: ఒకవేళ ఇది కవిత్వం అయితే మీరు దీని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తీసుకురండని. కాని దానిని ఎవ్వరూ ఈ రోజు వరకు పూర్తి చేయలేక పోయారు. ఇంకా చూడండి, 26:224-226.

    [2] చూడండి, 15:1