A translation of every ayah of the Quran in Telugu.
గోరీలలో ఉన్నవారు ఉదయం మరియు సాయంత్రం దాని ముందు ప్రవేశ పెట్టబడతారు. ఇదే గోరీల శిక్ష, 'అజాబె ఖబ్ర్!' దీనిని గురించి ఎన్నో 'హదీస్' లు ఉన్నాయి. 'ఆయి'షహ్ (ర.'అన్హా) దైవప్రవక్త ('స'అస) తో ప్రశ్నిస్తే అతను ఇలా అన్నారు:'అవును గోరీల శిక్ష తథ్యం.' ('స'హీ'హ్ బు'ఖారీ) మరొక 'హదీస్' : మీలో ఎవరైనా మరణిస్తే అతనికి ఉదయం మరియు సాయంత్రం అతన చోటు (స్వర్గంలో లేక నరకంలో అతని స్థానం) చూపబడుతుంది. మరియు అతనితో అనబడుతుంది: 'ఇదే నీ గమ్యస్థానం. పునరుత్థఆన దినమున అల్లాహ్ (సు.తా.) నిన్ను ఇక్కడికే పంపుతాడు.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం). చనిపోయిన తరువాత పునరుత్థానదినం వరకు ఉండే కాలాన్ని బర్'జఖ్ అంటారు.
[2] ఆల-ఫిర్'ఔన్: అంటే, ఫిర్'ఔన్, అతని జాతివారు మరియు అతని అనుచరులందరూ.
Loading…
Loading…