"మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)." [1]1
Footnotes
[1]
పై మూడు ఆయత్ లలో విశ్వాసుల కొరకు రెండు శుభవార్తలు ఉన్నాయి. 1) దైవదూతలు ('అలైహిమ్. స.) వారికై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. 2) విశ్వాసుల కుటుంబీకులందరూ స్వర్గంలో ఒకే చోట ఉంటారు.