వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, కాని దాని విషయంలో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకవేళ నీ ప్రభువు నుండి, మొదటి నుంచే నిర్ణయం తీసుకోబడి ఉండక పోతే, [1] వారి మధ్య ఎప్పుడో తీర్పు జరిగి వుండేది. మరియు నిశ్చయంగా, వారు దానిని గురించి ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు.1
Footnotes
[1]
అంటే వారికొక గడువు నిర్ణయించబడి ఉంది మరియు వారికి వ్యవధి ఇవ్వబడుతోంది. చూడండి, 35:45.