Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ash-Shuraa — Ayah 23

42:23
ذَٰلِكَ ٱلَّذِي يُبَشِّرُ ٱللَّهُ عِبَادَهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِۗ قُل لَّآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًا إِلَّا ٱلۡمَوَدَّةَ فِي ٱلۡقُرۡبَىٰۗ وَمَن يَقۡتَرِفۡ حَسَنَةٗ نَّزِدۡ لَهُۥ فِيهَا حُسۡنًاۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ شَكُورٌ ٢٣
ఆ (స్వర్గపు) శుభవార్తనే, అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు!" [1] మరియు ఎవడు మంచిని సంపాదించుకుంటాడో, అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.1
Footnotes
  • [1]

    మక్కా ముష్రిక్ ఖురైషులు చాలామంది దైవప్రవక్త ('స'అస) దగ్గరి సంబంధీకులే. ఇక్కడ వారితో: 'స్నేహ, ప్రేమభావాలు చూపకున్నా - తాను, అల్లాహ్ (సు.తా.) ధర్మం ఇస్లాం ను ప్రచారం చేస్తున్నందుకు - కనీసం శత్రుత్వమైనా వహించకండి.' అని చెప్పమని అల్లాహ్ (సు.తా.) దైవప్రవక్త ('స'అస) ను ఆదేశిస్తున్నాడు.

    మరొక ముఖ్య విషయం ఇక్కడ షియా తెగవారు భిన్నంగా అర్థం చేసుకొని దానిని ప్రచారం చేస్తున్నది: 'ఇక్కడ బంధుత్వ ప్రేమను వారు, 'అలీ, ఫాతిమా, 'హసన్ మరియు 'హుసైన్ ర'ది.'అన్హుమ్ లతో మాత్రమే, ప్రేమతో వ్యవహరించడం, అని అర్థం తీశారు. ఈ సూరహ్ మక్కాలో అవతరింపజేయబడింది. అప్పుడు 'అలీ మరియు ఫాతిమా (ర'ది. 'అన్హుమ్)ల వివాహం కూడా కాలేదు. మరొక విషయమేమిటంటే దైవప్రవక్త ('స'అస) కు నలుగురు కుమార్తెలు, 'జైనబ్, రుఖయ్య, ఉమ్మె కుల్సూ'మ్, ఫాతిమ మరియు ముగ్గురు కుమారులు, ఖాసిమ్, 'అబ్దుల్లాహ్ మరియు ఇబ్రాహీమ్ (రజి.అన్హుమ్)లు. కుమారులందరూ చిన్న వయస్సులలోనే చనిపోయారు. కాని ఇతర ముగ్గురు కుమార్తెలు (ర'ది.'అన్హుమ్) భర్తా, పిల్లలు గలవారు. వారు కూడా దైవప్రవక్త ('స'అస) యొక్క దగ్గరి సంబంధీకు (ఖురబా)లలోని వారే కదా! వారిలో ఇద్దరు మూడవ 'ఖలీఫా 'ఉస్మాన్ (ర'ది.'అ.) భార్యలు కూడాను. కాని ఈ షియా తెగవారు, వారిని దైవప్రవక్త ('స'అస) దగ్గరి సంబంధీకులలో పరిగణించకపోవడం అతిశయం కాదా!