Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ash-Shuraa — Ayah 3

42:3
كَذَٰلِكَ يُوحِيٓ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ ٱللَّهُ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ٣
(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు.[1]1
Footnotes
  • [1] ఏ విధంగానైతే దైవప్రవక్త ('స'అస)పై దివ్యజ్ఞానం అవతరింపజేయబడిందో, అదే విధంగా అతనికి ముందు వచ్చిన ప్రవక్తలపై కూడా అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) పై వ'హీ అవతరణను గురించి, ఒక 'స'హాబీ (ర'ది.'అ), దైవప్రవక్త ('స'అస) ను ప్రశ్నించగా ఇలా అన్నారు : "కొన్ని సార్లు అది (వ'హీ) నా దగ్గరకు ఘంటల శబ్దం వలే వస్తుంది. ఇది చాలా కఠినతరమైనది. అది ఆగిన తరువాత నాకు అంతా కంఠస్తమైపోతుంది. కొన్నిసార్లు దైవదూత ('అ.స.) మానవరూపంలో వచ్చి నాకు చెబుతాడు. అతను చెప్పినదంతా నాకు జ్ఞాపకమైపోతుంది." 'ఆయిషహ్ (ర.'అన్హా) అన్నారు : "నేను విపరీతమైన చలికాలంలో కూడా, వ'హీ అవతరణ ముగిసిన తరువాత, దైవప్రవక్త ('స'అస) ను చెమటలో మునిగి పోవటాన్ని చూశాను. మరియు అతని నుదుటి నుండి చెమట బిందువులు కారటం కూడా చూశాను." ('స'హీ'హ్ బు'ఖారీ).