Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Ahqaf — Ayah 6

46:6
وَإِذَا حُشِرَ ٱلنَّاسُ كَانُواْ لَهُمۡ أَعۡدَآءٗ وَكَانُواْ بِعِبَادَتِهِمۡ كَٰفِرِينَ ٦
మరియు మానవులను (పునరుత్థాన దినమున) సమావేశ పరచిబడినపుడు, (ఆరాధించబడిన) వారు! (తమను ఆరాధించిన) వారికి విరోధులై ఉంటారు. మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు. [1]1
Footnotes
  • [1] ఈవిధమైన ఆయత్ లు ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చాయి. చూడండి, 10:29, 19:81-82, 29:25, 18:52, 16:86 మొదలైనవి అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించి ఆరాధించే దైవాలు రెండు రకాలు. 1) నిర్జీవులు: అవి విగ్రహాలు, చెట్లుచేమలూ, సూర్యచంద్రులూ, అగ్ని మొదలైనవి. పునరుత్థానదినమున అల్లాహ్ (సు.తా.) వీటికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అవి, వారి ఆరాధనను తిరస్కరిస్తాయి. 2) రెండవరకానికి చెందిన వారు ప్రవక్తలు, ఉదాహరణ ఈ'సా, 'ఉజైర్, దైవదూతలు ('అలైహిమ్ స.) మరియు సద్పురుషులు వీరి సమాధానం అల్లాహ్ (సు.తా.) సమక్షంలో - ఖుర్ఆన్ లో పేర్కొనబడిన - 'ఈసా ('అ.స.) సమాధానంలాగానే ఉంటుంది. ఇంతేకాక షై'తానులు కూడా వీరి ఆరాధనను నిరాకరిస్తారు. ఉదారహరణకు చూ. ' 28:63 .