Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Muhammad — Ayah 4

47:4
فَإِذَا لَقِيتُمُ ٱلَّذِينَ كَفَرُواْ فَضَرۡبَ ٱلرِّقَابِ حَتَّىٰٓ إِذَآ أَثۡخَنتُمُوهُمۡ فَشُدُّواْ ٱلۡوَثَاقَ فَإِمَّا مَنَّۢا بَعۡدُ وَإِمَّا فِدَآءً حَتَّىٰ تَضَعَ ٱلۡحَرۡبُ أَوۡزَارَهَاۚ ذَٰلِكَۖ وَلَوۡ يَشَآءُ ٱللَّهُ لَٱنتَصَرَ مِنۡهُمۡ وَلَٰكِن لِّيَبۡلُوَاْ بَعۡضَكُم بِبَعۡضٖۗ وَٱلَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَلَن يُضِلَّ أَعۡمَٰلَهُمۡ ٤
కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు,[1] వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుద్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి,[2] లేదా పరిహార ధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు.1
Footnotes
  • [1]

    ప్రతి మానవునికి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ధర్మ విషయంలో బలవంతం లేదు, చూడండి, 2:256. కావున ఎవరైనా మీ ఇస్లాం ధర్మపాలన కారణంగా మీపై దౌర్జన్యాలు చేస్తే! మీరు ఇస్లాంపై నడవకుండా మీ స్వాతంత్ర్యాన్ని భంగపరిస్తే, వారితో మీ మానప్రాణాల రక్షణ మరియు మీ ఇస్లాం ధర్మ రక్షణకై, వారిని పూర్తిగా అణగద్రొక్కే వరకు, లేదా వారిని ఖైదీలుగా చేసుకునే వరకు, వారితో భయంకరంగా పోరాడమే జిహాద్. వారిపై ప్రాబల్యం వహించిన తరువాత వారిని బంధించండి. యుద్ధం ముగిసిన తరువాత వారిలో మంచితనం చూస్తే వారిని కనికరించి, లేదా పరిహారం తీసుకొని వదలండి. చూడండి, 2:190-191. ఇంకా చూడండి జిహాద్ ను గురించి అవతరింపజేయబడిన మొట్టమొదటి ఆయత్ లకు 22:39-40.

    [2] పరిహారధనానికి బదులుగా యుద్ధఖైదీలను పరస్పరం మార్పిడి కూడా చేసుకోవచ్చు.