Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Fath — Ayah 26

48:26
إِذۡ جَعَلَ ٱلَّذِينَ كَفَرُواْ فِي قُلُوبِهِمُ ٱلۡحَمِيَّةَ حَمِيَّةَ ٱلۡجَٰهِلِيَّةِ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلۡمُؤۡمِنِينَ وَأَلۡزَمَهُمۡ كَلِمَةَ ٱلتَّقۡوَىٰ وَكَانُوٓاْ أَحَقَّ بِهَا وَأَهۡلَهَاۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٗا ٢٦
సత్యాన్ని తిరస్కరించినవారు, తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల, మూర్ఖపు పట్టు వహించినప్పుడు,[1] అల్లాహ్! తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద, శాంతిని అవతరింప జేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిర పరిచాడు. మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.1
Footnotes
  • [1]

    'హమియ్యతల్ జాహిలియ్యహ్: అంటే ఇక్కడ ముస్లింలను ఎన్నటికీ మక్కాలోకి రానివ్వకూడదు అనే మూర్ఖ హఠము. అంటే ముస్లింలు 'హరంలో ప్రవేశించి, నమా'జ్ చేయటాన్ని మక్కా ముష్రిక్ ఖురైషులు సహించేవారు కాదు. ఎందుకంటే ముస్లింలు అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించేవారు. కాని ముష్రిక్ లు తమ విగ్రహాలను ఆరాధించేవారు. ఆ అభిమానం వారు ముస్లింలతో చేసిన సంధిలో వ్యక్తమవుతోంది. అది మొదట ముష్రిక్ లకు అనుకూలమైనదిగా కనిపించినా చివరకు వారికి సహించరానిదిగా మారింది. వారి పతనానికి కారణమయ్యింది.

    ఆ సంధి వ్రాసేటప్పుడు దైవప్రవక్త ('స'అస), 'అలీ (ర'ది.'అ.)తో మొదట: "బిస్మిల్లా హిర్ర'హ్ మా నిర్ర'హీమ్" అని వ్రాయమంటారు. అప్పుడు సంధి చేసుకోవటానికి వచ్చిన సుహైల్ బిన్ 'అమ్ర్ అంటాడు: మేము 'అర్ర'హ్ మాన్ అర్ర'హీమ్' ఏమిటో ఎరుగము. మేము వాడే పదం: "బిస్మిక అల్లాహుమ్మ" - 'నీ పేరుతో ఓ అల్లాహ్!' అని వ్రాయి, అంటాడు. దైవప్రవక్త ('స'అస) అలీ (ర'ది.'అ.)ను అలా వ్రాయమని అంటారు. ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) అంటారు: 'ము'హమ్మద్ రసూలుల్లాహ్ మరియు మక్కా వాసుల మధ్య ఈ సంధి జరుగున్నది.' అని వ్రాయమంటారు. అలీ (ర'ది.'అ.) ను వెంటనే ఆపుతూ ముష్రిక్ నాయకుడు అంటాడు: 'రసూలుల్లాహ్' అనే పదవి మీదనే కదా మా మధ్య - మీ మధ్య వివాదమున్నది. అలా కాదు: 'ము'హమ్మద్ బిన్ అబ్దుల్లాహ్' అని వ్రాయాలి అంటాడు. దైవప్రవక్త ('స'అస) దానిని కొట్టేసి అలాగే వ్రాయమని అలీ (ర'ది.'అ.)తో అంటారు. దానికి అలీ (ర'ది.'అ.) ఒప్పుకోరు. అప్పుడు దైవప్రవక్త ('స'అస) తమ చేతితోనే దానిని కొట్టేసి, అతడు చెప్పినట్లు వ్రాయమంటారు. అప్పుడు ముస్లింల క్రోధావేశాలకు అంతులేకుండా పోతుంది. కాని అల్లాహ్ (సు.తా.) వారి హృదయాలకు శాంతిని ప్రసాదిస్తాడు. ('స.ముస్లిం, నసాయి', ఇబ్నె'హంబల్, - తబరీ).