Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Hadid — Ayah 13

57:13
يَوۡمَ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُواْ ٱنظُرُونَا نَقۡتَبِسۡ مِن نُّورِكُمۡ قِيلَ ٱرۡجِعُواْ وَرَآءَكُمۡ فَٱلۡتَمِسُواْ نُورٗاۖ فَضُرِبَ بَيۡنَهُم بِسُورٖ لَّهُۥ بَابُۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحۡمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلۡعَذَابُ ١٣
ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు:[1] "మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము."[2] వారితో ఇలా అనబడుతుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది[3] మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది.[4]1
Footnotes
  • [1]

    చూడండి, 29:11.

    [2] కపటవిశ్వాసులైన స్త్రీపురుషులు కొంతదూరం విశ్వాసుల వెలుగులో నడిచిన తరువాత, అల్లాహ్ (సు.తా.) వారిపై చీకటిని విధిస్తాడు. అప్పుడు వారు అలా పలుకుతారు.

    [3] అంటే స్వర్గం.

    [4] అంటే నరకం.