Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Mujadila — Ayah 11

58:11
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قِيلَ لَكُمۡ تَفَسَّحُواْ فِي ٱلۡمَجَٰلِسِ فَٱفۡسَحُواْ يَفۡسَحِ ٱللَّهُ لَكُمۡۖ وَإِذَا قِيلَ ٱنشُزُواْ فَٱنشُزُواْ يَرۡفَعِ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ دَرَجَٰتٖۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ١١
ఓ విశ్వాసులారా! సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించమని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటు కల్పిస్తే, అల్లాహ్ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు.[1] మరియు ఒకవేళ మీతో (నమాజ్ లేక జిహాద్ కు) లేవండి అని చెప్పబడితే! మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు.[2] మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.1
Footnotes
  • [1]

    ఈ సమావేశాలు ధర్మసమావేశాలు జుమ'అహ్ లేక ఇతర సమావేశాలు కావచ్చు! మొదట వచ్చినవారు విడివిడిగా దూరం దూరంగా కూర్చుంటే తరువాత వచ్చే వారికి చోటు దొరుకుతుంది. దైవప్రవక్త ప్రవచనం: 'ఏ వ్యక్తికి కూడా మరొక వ్యక్తిని అతని చోటు నుండి లేపి కూర్చోవటం సభ్యత కాదు. కావున మీరు సమావేశంలో కూర్చున్నప్పుడు దూరం దూరంగా కూర్చోండి.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం)

    [2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: ఒక భక్తిపరుని ('ఆబిద్)పై ఒక జ్ఞానవంతుని ('ఆలిమ్) యొక్క ఆధిక్యత పూర్ణిమ రాత్రిలో, నక్షత్రాలపై చంద్రునికి ఉండే ఆధిక్యత వంటిది. (ఇబ్నె-'హంబల్, అబూ-దావూద్, తిర్మిజీ', నసాయీ', ఇబ్నె-మాజా. మరియు దారిమీ.