Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Hashr — Ayah 10

59:10
وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعۡدِهِمۡ يَقُولُونَ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا وَلِإِخۡوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلۡإِيمَٰنِ وَلَا تَجۡعَلۡ فِي قُلُوبِنَا غِلّٗا لِّلَّذِينَ ءَامَنُواْ رَبَّنَآ إِنَّكَ رَءُوفٞ رَّحِيمٌ ١٠
మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు.[1] ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు!"1
Footnotes
  • [1] వీరు ఫయ్అ'కు హక్కుదారులైన మరొకరకం వారు. వీరు సహాబీల తరువాత తరం వారు మరియు వారి అడుగుజాడలలో నడిచేవారు. వీరిలో తాబ'యీన్ మరియు వారిని అనుసరించిన వారూ మరియు పునరుత్థాన దినం వరకు ఈమాన్ లో ప్రవేశించే వారందరూ ఉన్నారు! ఇమామ్ మాలికి (ర'హ్మ) ఈ ఆయత్ వ్యాఖ్యానంలో అన్నారు: 'రాఫజీ, ఎవరైతే 'స'హాబా (ర'.ది.'అన్హుమ్) లను దూషిస్తారో, వారికి ఫయ్అ' ధనంలో భాగం లేదు. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) 'స'హాబా (ర'.ది.'అన్హుమ్)లను పొగుడుతున్నాడు. మరియు వారేమో స'హాబా (ర.'ది.'అన్హుమ్)లను దూషఇస్తున్నారు.' (ఇబ్నె-కసీ'ర్). 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం: మీరు స'హాబా (ర'.ది'అన్హుమ్) ల కొరకు ఇస్తి'గ్ ఫార్ చేయండని, దైవప్రవక్త ('స'అస) ఆజ్ఞాపించబడ్డారు. కాని మీరు వారిని దూషిస్తున్నారు. నేను మీ ప్రవక్త ('స'అస) ను ఇలా అంటూ ఉండగా విన్నాను: 'ఈ జాతిలోని చివరివారు తమ మొదటి వారిని శపించనంత వరకూ ఈ జాతి నశించదు!' (బ'గవీ ఈ 'హదీస్' ను ఉల్లేఖించారు.