Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Hashr — Ayah 24

59:24
هُوَ ٱللَّهُ ٱلۡخَٰلِقُ ٱلۡبَارِئُ ٱلۡمُصَوِّرُۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰۚ يُسَبِّحُ لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ٢٤
ఆయనే, అల్లాహ్! విశ్వసృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి.[1] ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.1
Footnotes
  • [1]

    అల్-'ఖాలిఖు: The Creator of all things. సృష్టికర్త. చూడండి, 6:103.

    అల్-బారిఉ':The Maker, ప్రతిదాని నిర్మాత, ఎట్టి పోలిక, సామ్యం లేకుండా ప్రతి దానిని సృజించేవాడు. లేమి నుండి ఉనికి లోకి తెచ్చేవాడు. చూడండి: 2:54

    అల్-ము'సవ్విరు: The Fashioner, of all existing things, రూపమిచ్చేవాడు, తాను కోరిన విధంగా తన సృష్టి రూపాన్ని తీర్చిదిద్దేవాడు. 3:6.

    అల్-'హకీము: All-Wise, Possessing knowledge or Science, Omniscient, మహో వివేకవంతుడు, వివేచనాపరుడు. చూడండి, 2:32. ఇంకా చూడండి, 7:180. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.