Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah At-Talaq — Ayah 4

65:4
وَٱلَّٰٓـِٔي يَئِسۡنَ مِنَ ٱلۡمَحِيضِ مِن نِّسَآئِكُمۡ إِنِ ٱرۡتَبۡتُمۡ فَعِدَّتُهُنَّ ثَلَٰثَةُ أَشۡهُرٖ وَٱلَّٰٓـِٔي لَمۡ يَحِضۡنَۚ وَأُوْلَٰتُ ٱلۡأَحۡمَالِ أَجَلُهُنَّ أَن يَضَعۡنَ حَمۡلَهُنَّۚ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجۡعَل لَّهُۥ مِنۡ أَمۡرِهِۦ يُسۡرٗا ٤
మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచి పోయినవారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతుస్రావం ఇంకా ప్రారంభం కాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు[1]. మరియు గర్భవతులైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు[2]. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన, అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు.1
Footnotes
  • [1]

    ఋతుస్రావం ప్రారంభం కాని స్త్రీలకు మరియు ఋతుస్రావం ఆగిపోయిన స్త్రీలకు వేచి ఉండే గడువు మూడు నెలలు.

    [2] గర్భవతులైన స్త్రీల గడువు - విడాకులివ్వబడినా లేక భర్త మరణించినా - ప్రసవించే వరకు! అలాంటి ప్రసవం విడాకుల తరువాత లేక భర్త మరణించిన రెండవరోజే అయినా సరే! ఈ విషయం 'హదీస్'లలో కూడా ఉంది. (బు.'ఖారీ, ముస్లిం). ఇతర స్త్రీలు భర్త మరణించిన తరువాత నాలుగు మాసాల పది రోజులు వేచి ఉండాలి. 2:234.