Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah At-Tahrim — Ayah 3

66:3
وَإِذۡ أَسَرَّ ٱلنَّبِيُّ إِلَىٰ بَعۡضِ أَزۡوَٰجِهِۦ حَدِيثٗا فَلَمَّا نَبَّأَتۡ بِهِۦ وَأَظۡهَرَهُ ٱللَّهُ عَلَيۡهِ عَرَّفَ بَعۡضَهُۥ وَأَعۡرَضَ عَنۢ بَعۡضٖۖ فَلَمَّا نَبَّأَهَا بِهِۦ قَالَتۡ مَنۡ أَنۢبَأَكَ هَٰذَاۖ قَالَ نَبَّأَنِيَ ٱلۡعَلِيمُ ٱلۡخَبِيرُ ٣
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు[1] రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు[2] చెప్పింది. మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయట పడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: "ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: "నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు[3]."1
Footnotes
  • [1]

    హఫ్స

    [2] 'ఆయి'షహ్

    [3] ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర విషయాలు కూడా దైవప్రవక్త ('స'అస) కు దివ్యజ్ఞానం ద్వారా తెలియజేయబడేవి.