Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Mulk — Ayah 2

67:2
ٱلَّذِي خَلَقَ ٱلۡمَوۡتَ وَٱلۡحَيَوٰةَ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلٗاۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفُورُ ٢
ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు[1]. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.1
Footnotes
  • [1] రూ'హ్: ఒక విచిత్రమైన శక్తి. దాని వాస్తవం అల్లాహ్ (సు.తా.)కు తప్ప మరెవ్వరికీ తెలియదు. దాని సంబంధం ఒక శరీరంతో ఏర్పడినప్పుడు అది సజీవిగా పరిగణించబడుతుంది. దాని సంబంధం తెగిపోయిన శరీరం, మృతదేహంగా (నిర్జీవిగా) పరిగణించబడుతుంది. అల్లాహ్ (సు.తా.) ఈ తాత్కాలిక జీవితాన్నిచ్చి, తరువాత మరణింపజేస్తాడు. ఈ తాత్కాలిక జీవితాన్ని సరైన విధంగా ఎవడు వినియోగిస్తాడనేది ఆయన (సు.తా.) పరీక్షిస్తున్నాడు. ఎవడైతే ఈ తాత్కాలిక జీవితాన్ని విశ్వాసం మరియు అల్లాహ్ (సు.తా.) విధేయత కోసం వినియోగిస్తాడో, వాడు మంచి ప్రతిఫలం పొందుతాడు. అలా చేయని వాడి కొరకు నరకశిక్ష ఉంటుంది.