Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 69

وَأَشۡرَقَتِ ٱلۡأَرۡضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلۡكِتَٰبُ وَجِاْيٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّ وَهُمۡ لَا يُظۡلَمُونَ ٦٩
సర్వాధిక్యుడైన ప్రభువు దాసుల మధ్య తీర్పునివ్వటం కొరకు ప్రత్యక్షమయినప్పుడు భూమి కాంతితో వెలిగిపోతుంది. మరియు ప్రజల కర్మల పత్రాలు తెరవబడుతాయి. మరియు ప్రవక్తలను తీసుకుని రావటం జరుగుతుంది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జాతి వారిని దైవ ప్రవక్తల కొరకు వారి జాతుల వారిపై సాక్ష్యం పలకటానికి తీసుకురాబడుతుంది. మరియు అల్లాహ్ వారందరి మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు. ఆ రోజు వారికి అన్యాయం చేయబడదు. అప్పుడు ఏ మనిషి యొక్క పాపము అధికం చేయబడదు మరియు ఏ పుణ్యమూ తగ్గించబడదు.