Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 71

وَسِيقَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ جَهَنَّمَ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا فُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَتۡلُونَ عَلَيۡكُمۡ ءَايَٰتِ رَبِّكُمۡ وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ بَلَىٰ وَلَٰكِنۡ حَقَّتۡ كَلِمَةُ ٱلۡعَذَابِ عَلَى ٱلۡكَٰفِرِينَ ٧١
మరియు దైవదూతలు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారిని నరకం వైపునకు గుంపులు గుంపులుగా అవమానపరచి తోలుతారు. చివరికి వారు నరకం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దానిపై బాధ్యులుగా నియమింపబడిన దైవదూతల్లోంచి దాని పర్యవేక్షకులు దాని తలపులను తెరుస్తారు. మరియు వారు వారితో మందలింపులతో ఇలా పలుకుతూ అభివందనములు చేస్తారు : ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన ప్రవక్తలు తమపై అవతరింపబడిన మీ ప్రభువు ఆయతులను మీపై చదువుతూ మరియు మిమ్మల్ని ప్రళయదినమున కలవటం గురించి అందులో ఉన్న కఠినమైన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడుతూ రాలేదా ?. అవిశ్వాసపరులు స్వయంగా అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : ఎందుకు కాదు. వాస్తవానికి ఇదంత జరిగింది. మరియు అవిశ్వాసపరులపై శిక్ష యొక్క వాక్కు అనివార్యమైనది. మరియు మేము అవిశ్వసిస్తూ ఉండేవారము.