Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 73

وَسِيقَ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ إِلَى ٱلۡجَنَّةِ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا وَفُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَا سَلَٰمٌ عَلَيۡكُمۡ طِبۡتُمۡ فَٱدۡخُلُوهَا خَٰلِدِينَ ٧٣
మరియు దైవదూతలు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భయభీతి కలిగిన విశ్వాసపరులను గౌరవోన్నతులైన(దైవదూదలు) గుంపులుగుంపులుగా స్వర్గం వైపునకు మృధువుగా తీసుకునివస్తారు. చివరికి వారు స్వర్గం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దాని ద్వారములు తెరవబడి ఉంటాయి. మరియు దాని బాధ్యత ఇవ్వబడిన దైవదూతలు వారితో ఇలా పలుకుతారు : ప్రతీ కీడు నుండి మరియు మీరు ఇష్టపడని ప్రతీ దాని నుండి మీపై శాంతి కురియుగాక. మీ మనస్సులు,మీ కర్మలు శ్రేష్ఠమయ్యాయి. అయితే మీరు స్వర్గములో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి.