Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 11

قَالُواْ رَبَّنَآ أَمَتَّنَا ٱثۡنَتَيۡنِ وَأَحۡيَيۡتَنَا ٱثۡنَتَيۡنِ فَٱعۡتَرَفۡنَا بِذُنُوبِنَا فَهَلۡ إِلَىٰ خُرُوجٖ مِّن سَبِيلٖ ١١
మరియు అవిశ్వాసపరులు తమ పాపములను అంగీకరిస్తూ ఇలా పలుకుతారు అప్పుడు వారి అంగీకారము గాని వారి పశ్చాత్తాపము గాని ప్రయోజనం కలిగించదు : ఓ మా ప్రభువా నీవు మాకు రెండు సార్లు మరణమును కలిగించావు మేము ఉనికిలో లేనప్పుడు అప్పుడు నీవు మమ్మల్ని ఉనికిలోకి తెచ్చావు, ఆ తరువాత ఉనికిలోకి తెచ్చిన తరువాత నీవు మమ్మల్ని మరణింపజేశావు. మరియు నీవు మమ్మల్ని రెండు సార్లు జీవింపజేశావు ఉనికిలో లేని స్థితి నుండి ఉనికిలోకి తెచ్చి మరియు మరణాంతరం లేపటం కొరకు మమ్మల్ని జీవింపజేసావు. మేము చేసుకున్న పాపములను మేము అంగీకరించాము. ఏమి ఏదైన మార్గము ఉన్నదా దానిపై మేము నడిచి మేము నరకాగ్ని నుండి బయటపడటానికి. అప్పుడు మేము మా కర్మలను సరిచేసుకోవటానికి జీవితం వైపునకు మరలుతాము . అప్పుడు నీవు మా నుండి సంతుష్టి చెందుతావు ?!.