Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 16

يَوۡمَ هُم بَٰرِزُونَۖ لَا يَخۡفَىٰ عَلَى ٱللَّهِ مِنۡهُمۡ شَيۡءٞۚ لِّمَنِ ٱلۡمُلۡكُ ٱلۡيَوۡمَۖ لِلَّهِ ٱلۡوَٰحِدِ ٱلۡقَهَّارِ ١٦
ఆ రోజు వారు బహిర్గతమై ఒకే ప్రాంతంలో సమావేశమవుతారు. వారి నుండి అల్లాహ్ పై వారి అస్తిత్వాల్లోంచిగాని వారి కర్మల్లోంచి గాని వారి ప్రతిఫలముల్లోంచి గాని ఏదీ గోప్యంగా ఉండదు. ఈ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరి కొరకు ? అని అడుగుతాడు. అప్పుడు సమాధానం ఒక్కటే అవుతుంది . సామ్రాజ్యాధికారము తన అస్తిత్వంలో,తన గుణగణాల్లో,తన కార్యాల్లో ఒక్కడే అయిన అల్లాహ్ కే చెందుతుంది. అన్నింటిపై ఆధిక్యత కలవాడు మరియు ప్రతీది ఆయనకు లోబడి ఉంటుంది.