Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 18

وَأَنذِرۡهُمۡ يَوۡمَ ٱلۡأٓزِفَةِ إِذِ ٱلۡقُلُوبُ لَدَى ٱلۡحَنَاجِرِ كَٰظِمِينَۚ مَا لِلظَّٰلِمِينَ مِنۡ حَمِيمٖ وَلَا شَفِيعٖ يُطَاعُ ١٨
ఓ ప్రవక్తా మీరు వారిని ప్రళయదినము నుండి భయపెట్టండి. దగ్గరకు వచ్చిన ఈ ప్రళయము వస్తున్నది. మరియు ప్రతీ వచ్చేది దగ్గరవుతుంది. ఆ రోజున హృదయములు దాని భయాందోళనల వలన పైకి వచ్చేస్తాయి చివరికి అవి తమ యజమానుల గొంతుల వరకు వచ్చేస్తాయి. ఎవరైతే మౌనంగా ఉంటారో వారిలో నుండి ఎవరూ మాట్లాడరు కాని కరుణామయుడు ఎవరికి అనుమతిస్తే తప్ప. మరియు షిర్కు,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు ఏ స్నేహితుడు గాని దగ్గరి బంధువు గాని ఉండడు. మరియు అతని కొరకు సిఫారసు చేయటానికి నియమించబడినప్పుడు అతని మాట చెలామణి చేసుకొనబడే సిఫారసు చేసేవాడు ఎవడూ ఉండడు.