Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 28

وَقَالَ رَجُلٞ مُّؤۡمِنٞ مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَكۡتُمُ إِيمَٰنَهُۥٓ أَتَقۡتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ ٱللَّهُ وَقَدۡ جَآءَكُم بِٱلۡبَيِّنَٰتِ مِن رَّبِّكُمۡۖ وَإِن يَكُ كَٰذِبٗا فَعَلَيۡهِ كَذِبُهُۥۖ وَإِن يَكُ صَادِقٗا يُصِبۡكُم بَعۡضُ ٱلَّذِي يَعِدُكُمۡۖ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ مُسۡرِفٞ كَذَّابٞ ٢٨
మరియు ఫిర్ఔన్ వంశము నుండి అల్లాహ్ పై విశ్వాసముంచిన ఒక వ్యక్తి తన విశ్వాసమును తన జాతి వారి నుండి దాచి ఉంచినవాడు మూసా హత్య గురించి వారు చేసుకున్న దృఢ సంకల్పమును విభేదిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు ఏ పాపము చేయని ఒక వ్యక్తిని నా ప్రభువు అల్లాహ్ అని చెప్పినంత మాత్రాన చంపేస్తారా ?. వాస్తవానికి అతను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని అతని వాదనలో అతని నిజాయితీ పై సూచించే వాదనలను మరియు ఆధారాలను మీ వద్దకు తీసుకుని వచ్చాడు. ఒక వేళ అతడు అసత్యపరుడని అనుకుంటే అతని అసత్యము యొక్క కీడు అతనిపైనే మరలుతుంది. ఒక వేళ అతడు నిజాయితీపరుడైతే మీకు అతను వాగ్దానం చేసిన శిక్ష నుండి కొంత భాగము తొందరగా మీకు చేరుతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వాడిని,తనపై మరియు తన ప్రవక్త పై అబద్దములను అపాదించేవాడికి సత్యము వైపునకు భాగ్యమును కలిగించడు.