Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 34

وَلَقَدۡ جَآءَكُمۡ يُوسُفُ مِن قَبۡلُ بِٱلۡبَيِّنَٰتِ فَمَا زِلۡتُمۡ فِي شَكّٖ مِّمَّا جَآءَكُم بِهِۦۖ حَتَّىٰٓ إِذَا هَلَكَ قُلۡتُمۡ لَن يَبۡعَثَ ٱللَّهُ مِنۢ بَعۡدِهِۦ رَسُولٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَنۡ هُوَ مُسۡرِفٞ مُّرۡتَابٌ ٣٤
మరియు నిశ్చయంగా మూసా అలైహిస్సలాం కన్న ముందు యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారములను తీసుకుని వచ్చారు. అప్పుడు మీరు ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో సందేహంలో మరియు తిరస్కరించటంలో పడి ఉన్నారు. చివరికి ఆయన చనిపోయినప్పుడు మీరు సందేహంలో,సంశయంలో అధికమైపోయారు. మరియు మీరు ఇలా పలికారు : అల్లాహ్ అతని తరువాత ఏ ప్రవక్తనూ ఖచ్చితంగా పంపించడు. సత్యము నుండి మీ ఈ పెడద్రోవపడటం లాగే అల్లాహ్ ఎవరైతే అల్లాహ్ హద్దులను అతిక్రమిస్తాడో,ఆయన ఏకత్వం విషయంలో సందేహములో పడుతాడో అతడిని పెడద్రోవపెడతాడు.