Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 40

مَنۡ عَمِلَ سَيِّئَةٗ فَلَا يُجۡزَىٰٓ إِلَّا مِثۡلَهَاۖ وَمَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ يُرۡزَقُونَ فِيهَا بِغَيۡرِ حِسَابٖ ٤٠
దుష్కర్మకు పాల్పడిన వాడు అతను చేసిన కర్మ మాదిరిగానే మాత్రమే శిక్షింపబడుతాడు. అతనిపై శిక్షను అధికం చేయటం జరగదు. మరియు అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తూ సత్కర్మ చేసిన వాడికి ఆచరించిన వాడు పురుషుడైన లేదా స్త్రీ అయిన అతడు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం కనబరచిన వాడై ఉండాలి. ఈ ప్రశంసదగిన గుణాలను కలిగిన వారందరు ప్రళయదినమున స్వర్గములో ప్రవేశిస్తారు. అల్లాహ్ వారికి అందులో వాగ్దానం చేసిన ఫలాలను,ఎన్నటికి అంతము కాని స్థిరమైన అనుగ్రహాలను లెక్క లేనంతగా ఆహారముగా ప్రసాదిస్తాడు.