Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 45

فَوَقَىٰهُ ٱللَّهُ سَيِّـَٔاتِ مَا مَكَرُواْۖ وَحَاقَ بِـَٔالِ فِرۡعَوۡنَ سُوٓءُ ٱلۡعَذَابِ ٤٥
అప్పుడు వారు అతన్ని హత్య చేయటమునకు నిర్ణయించుకున్నప్పటి వారి కుట్ర కీడు నుండి అల్లాహ్ అతన్ని రక్షించాడు. మరియు ఫిర్ఔన్ వంశమునకు మునిగిపోయే శిక్ష చుట్టుముట్టింది. నిశ్చయంగా అల్లాహ్ ఇహలోకములో అతడిని మరియు అతని పూర్తి సైన్యమును ముంచివేశాడు.