Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 50

قَالُوٓاْ أَوَلَمۡ تَكُ تَأۡتِيكُمۡ رُسُلُكُم بِٱلۡبَيِّنَٰتِۖ قَالُواْ بَلَىٰۚ قَالُواْ فَٱدۡعُواْۗ وَمَا دُعَٰٓؤُاْ ٱلۡكَٰفِرِينَ إِلَّا فِي ضَلَٰلٍ ٥٠
నరకము యొక్క సంరక్షకులు అవిశ్వాసపరులను ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఏమీ మీ వద్దకు మీ ప్రవక్తలు స్పష్టమైన ఆధారములను మరియు సూచనలను తీసుకుని రాలేదా ?!. అప్పుడు అవిశ్వాసపరులు ఎందుకు కాదు వారు మా వద్దకు స్పష్టమైన ఆధారములను మరియు వాదనలను తీసుకుని వచ్చారు. పరిరక్షకులు వారిపై వ్యంగ్యంగా ఇలా పలికారు : అయితే మీరే వేడుకోండి. మేము మాత్రం అవిశ్వాసపరుల కొరకు సిఫారసు చేయము. మరియు అవిశ్వాసపరుల దుఆ మాత్రం వారి అవిశ్వాసం కారణం చేత స్వీకరించకపోవటం వలన నిర్వీర్యం మరియు వృధా అయింది.