Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 58

وَمَا يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُ وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَلَا ٱلۡمُسِيٓءُۚ قَلِيلٗا مَّا تَتَذَكَّرُونَ ٥٨
మరియు ఎవరైతే చూడలేడో, ఎవరైతే చూడగలడో ఇద్దరు సమానులు కారు. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కలిగి ఉండి, ఆయన ప్రవక్తను నిజమని నమ్మి, తమ కర్మలను మంచిగా చేస్తారో వారు మరియు వారితో పాటు ఎవరి ఆచరణ అయితే దురవిశ్వాసము,పాపకార్యముల వలన చెడుగా ఉంటుందో సమానులు కారు. మీరు మాత్రం చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తారు. ఒక వేళ మీరు హితోపదేశం గ్రహిస్తే మీరు రెండు వర్గముల మధ్య వ్యత్త్యాసమును తెలుసుకుని మీరు ఎవరైతే విశ్వసించి అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేస్తారో వారిలో నుండి అయిపోవటానికి ప్రయత్నిస్తారు.