Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 64

ٱللَّهُ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ قَرَارٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَصَوَّرَكُمۡ فَأَحۡسَنَ صُوَرَكُمۡ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡۖ فَتَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ ٦٤
ఓ ప్రజలారా అల్లాహ్ యే మీ కొరకు భూమిని మీరు దానిపై నివాసముండటానికి నివాసస్థలంగా సిద్ధం చేసి ఉంచాడు. మరియు ఆయన ఆకాశమును మీ పై పడిపోవటం నుండి ఆగిపోయినట్లుగా పటిష్టమైవ కట్టడంగా చేశాడు. మరియు మీ తల్లుల గర్భములలో మీకు రూపమునిచ్చి మీ రూపములను ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. మరియు ఆయన మీకు ధర్మ సమ్మతమైన ఆహారోపాధిని, వాటిలో శ్రేష్ఠమైనవి ప్రసాదించాడు. మీపై ఈ అనుగ్రహములను అనుగ్రహించిన వాడే అల్లాహ్ మీ ప్రభువు. కావున సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లాహ్ శుభధాయకుడు. పరిశుద్ధుడైన ఆయన తప్ప ఇంకొకరు వారి కొరకు ప్రభువు లేడు.