Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 67

هُوَ ٱلَّذِي خَلَقَكُم مِّن تُرَابٖ ثُمَّ مِن نُّطۡفَةٖ ثُمَّ مِنۡ عَلَقَةٖ ثُمَّ يُخۡرِجُكُمۡ طِفۡلٗا ثُمَّ لِتَبۡلُغُوٓاْ أَشُدَّكُمۡ ثُمَّ لِتَكُونُواْ شُيُوخٗاۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبۡلُۖ وَلِتَبۡلُغُوٓاْ أَجَلٗا مُّسَمّٗى وَلَعَلَّكُمۡ تَعۡقِلُونَ ٦٧
ఆయనే మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరల ఆయన మిమ్మల్ని దాని తరువాత వీర్యబిందువుతో ఆ పిదప వీర్య బిందువు తరువాత రక్తపు గడ్డతో మిమ్మల్ని సృష్టించాడు. దాని తరువాత ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భముల నుండి చిన్న పిల్లలుగా వెలికి తీస్తాడు. ఆ తరువాత మీరు దృఢమైన శరీరములు కల వయసుకు చేరుకుని ఆ తరువాత మీరు పెద్దవారై వృద్ధులయ్యే వరకు (మిమ్మల్ని పెంచుతాడు). మరియు మీలో నుండి కొందరు దాని కన్న ముందే చనిపోయేవారున్నారు. మరియు (ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు) మీరు అల్లాహ్ జ్ఞానంలో నిర్ణీత కాలమునకు చేరుకోవటానికి. మీరు దాని నుండి తగ్గించలేరు. మరియు మీరు దానికన్న పెంచలేరు. మరియు బహుశ మీరు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఈ వాదనలు,ఆధారల ద్వారా ప్రయోజనం చెందుతారని.