Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 7

ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ ٧
ఓ ప్రవక్తా నీ ప్రభువు యొక్క సింహాసమును మోస్తున్న దైవదూతలు మరియు దాని చుట్టు ఉన్న వారు తమ ప్రభువుకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడుతారు. మరియు ఆయనను విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మన్నింపును వేడుకుంటారు. తమ దుఆల్లో ఇలా పలుకుతూ : ఓ మా ప్రభువా నీ జ్ఞానం మరియు నీ కారుణ్యం ప్రతీ వస్తువుని చుట్టుముట్టి ఉన్నది. అయితే నీవు తమ పాపముల నుండి మన్నింపును వేడుకుని నీ ధర్మమును అనుసరించిన వారిని మన్నించు. మరియు వారికి నరకాగ్ని ముట్టుకోవటం నుంచి వారిని రక్షించు.