Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 82

أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَانُوٓاْ أَكۡثَرَ مِنۡهُمۡ وَأَشَدَّ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَمَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يَكۡسِبُونَ ٨٢
అయితే ఈ తిరస్కారులందరు భూమిలో సంచరించి వారికన్న మునుపటి సమాజాలవారి ముగింపు ఎలా జరిగినదో చూసి వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోలేదా ?. నిశ్ఛయంగా ఈ సమాజాలు వారి కన్నఅధికంగా సంపద కలవారై, ఎక్కువ బలవంతులై, భూమిలో ఎక్కువ చిహ్నాలను వదిలినవారై ఉండేవారు. ఎప్పుడైతే వారి వద్దకు నాశనం చేసే అల్లాహ్ శిక్ష వచ్చిపడినదో వారు సంపాదించుకున్న బలము వారికి దేనికి పనికిరాకపోయినది.