Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 85

فَلَمۡ يَكُ يَنفَعُهُمۡ إِيمَٰنُهُمۡ لَمَّا رَأَوۡاْ بَأۡسَنَاۖ سُنَّتَ ٱللَّهِ ٱلَّتِي قَدۡ خَلَتۡ فِي عِبَادِهِۦۖ وَخَسِرَ هُنَالِكَ ٱلۡكَٰفِرُونَ ٨٥
వారిపై కురిసే మా శిక్షను వారు కళ్ళారా చూసినప్పుడు వారి విశ్వాసము వారికి ఎటువంటి ప్రయోజనం కలిగించదు. అల్లాహ్ యొక్క సంప్రదాయము శిక్షను కళ్ళారా చూసినప్పుడు వారి విశ్వాసము వారికి ప్రయోజనం కలిగించదని తన దాసులలో జరిగినది. మరియు అవిశ్వాసపరులు శిక్ష అవతరించినప్పుడు అల్లాహ్ పై తమ అవిశ్వాసం వలన మరియు శిక్షను కళ్ళారా చూడక ముందే తౌబా చేయకపోవటం వలన వినాశన స్థానములకు చేరుకుని తమ స్వయమునకు నష్టమును కలిగించుకున్నారు.