Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 18

يَسۡتَعۡجِلُ بِهَا ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِهَاۖ وَٱلَّذِينَ ءَامَنُواْ مُشۡفِقُونَ مِنۡهَا وَيَعۡلَمُونَ أَنَّهَا ٱلۡحَقُّۗ أَلَآ إِنَّ ٱلَّذِينَ يُمَارُونَ فِي ٱلسَّاعَةِ لَفِي ضَلَٰلِۭ بَعِيدٍ ١٨
దాన్ని విశ్వసించని వారు దాని తొందరగా రావటమును కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎటువంటి లెక్క తీసుకోవటమును గాని ప్రతిఫలమును గాని ఏ శిక్షను గాని విశ్వసించరు. మరియు అల్లాహ్ ను విశ్వసించేవారు దానిలో ఉన్న వారి పరిణామము నుండి వారి భయము వలన దాని నుండి భయపడుతారు. మరియు అది ఎటువంటి సందేహము లేని సత్యమని ఖచ్చితమైన జ్ఞానముతో వారు తెలుసుకుంటారు. వినండి నిశ్ఛయంగా ఎవరైతే ప్రళయం విషయంలో వాదిస్తారో మరియు దాని గురించి తగువులాడుతారో మరియు దాని వాటిల్లే విషయంలో సందేహపడుతారో వారు సత్యము నుండి దూరంగా అపమార్గములో ఉన్నారు.