Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 20

مَن كَانَ يُرِيدُ حَرۡثَ ٱلۡأٓخِرَةِ نَزِدۡ لَهُۥ فِي حَرۡثِهِۦۖ وَمَن كَانَ يُرِيدُ حَرۡثَ ٱلدُّنۡيَا نُؤۡتِهِۦ مِنۡهَا وَمَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِن نَّصِيبٍ ٢٠
ఎవరైతే పరలోక ప్రతిఫలమును దానికి తగిన ఆచరణలను చేస్తూ కోరుకుంటాడో మేము అతని కొరకు అతని పుణ్యమును అధికం చేస్తాము. కాబట్టి ప్రతి పుణ్యము దానికి పది రెట్ల నుండి ఏడువందల రెట్లకు ఇంకా చాలా అధిక రెట్లకు పెరుగుతుంది. మరియు ఎవరైతే ఇహలోకమునొక్కటినే కోరుకుంటాడో మేము అతనికి అందులో అతని కొరకు నిర్ణయించబడిన భాగమును ప్రసాదిస్తాము. మరియు అతని కొరకు పరలోకములో దానిపై అతను ఇహలోకమును ప్రాధాన్యతను ఇవ్వటం వలన ఎటువంటి భాగము ఉండదు.