Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 48

فَإِنۡ أَعۡرَضُواْ فَمَآ أَرۡسَلۡنَٰكَ عَلَيۡهِمۡ حَفِيظًاۖ إِنۡ عَلَيۡكَ إِلَّا ٱلۡبَلَٰغُۗ وَإِنَّآ إِذَآ أَذَقۡنَا ٱلۡإِنسَٰنَ مِنَّا رَحۡمَةٗ فَرِحَ بِهَاۖ وَإِن تُصِبۡهُمۡ سَيِّئَةُۢ بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡ فَإِنَّ ٱلۡإِنسَٰنَ كَفُورٞ ٤٨
అయితే ఒక వేళ వారు దేని గురించైతే మీరు వారికి ఆదేశించారో వాటి నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారి కర్మలను పరిరక్షించటానికి వారిపై పరిరక్షకునిగా పంపించలేదు. మీకు ఏ సందేశములను చేరవేయమని ఆదేశించబడినదో వాటిని చేరవేసే బాధ్యత మాత్రమే మీపై ఉన్నది. వారి లెక్క తీసుకునే బాధ్యత అల్లాహ్ పై ఉన్నది. మరియు నిశ్చయంగా మేము మానవునికి మా వద్ద నుండి ఐశ్వర్యము,ఆరోగ్యము, వాటి లాంటి వాటిని కారుణ్యముగా రుచి చూపించినప్పుడు అతడు వాటితో సంబరపడిపోయేవాడు. మరియు ఒక వేళ మానవునికి ఏదైన ఆపద వారి పాపముల వలన కలిగితే నిశ్ఛయంగా వారి స్వభావము అల్లాహ్ అనుగ్రహములకు కృతఘ్నులయ్యి వాటికి కృతజ్ఞత తెలుపకపోవటం మరియు అల్లాహ్ తన విజ్ఞతతో నిర్ణయించిన దాని విషయంలో ఆగ్రహానికి లోనవటం.