Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 50

لِّلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ يَخۡلُقُ مَا يَشَآءُۚ يَهَبُ لِمَن يَشَآءُ إِنَٰثٗا وَيَهَبُ لِمَن يَشَآءُ ٱلذُّكُورَ ٤٩ أَوۡ يُزَوِّجُهُمۡ ذُكۡرَانٗا وَإِنَٰثٗاۖ وَيَجۡعَلُ مَن يَشَآءُ عَقِيمًاۚ إِنَّهُۥ عَلِيمٞ قَدِيرٞ ٥٠
ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి యొక్క సామ్రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. మగ లేదా ఆడ లేదా ఇతర వాటిలోంచి తాను తలచిన దాన్ని సృష్టిస్తాడు. తాను తలచిన వారికి ఆడ సంతానమును ఇచ్చి వారికి మగ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి మగ సంతానమును ఇచ్చి వారికి ఆడ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి ఆడ,మగ సంతానమును కలిపి ఇస్తాడు. మరియు తాను తలచిన వారికి సంతానము కలగకుండా గొడ్రాలుగా చేస్తాడు. నిశ్చయంగా జరుగుతున్నది,భవిష్యత్తులో జరగబోయేది ఆయనకు బాగా తెలుసు. మరియు ఇది ఆయన పరిపూర్ణ జ్ఞానం వలన మరియు సంపూర్ణ విజ్ఞత వలన జరుగుతుంది. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.